రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:06 AM
మండలంలోని పెదతాడు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో యానాది రవి (36) మృతి చెందినట్టు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.
డెంకాడ, జూన్19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదతాడు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో యానాది రవి (36) మృతి చెందినట్టు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామానికి చెందిన యానాది రవి కొంతకాలంగా బొలేరో వాహనానికి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. యథావిధిగా చిత్తూరు జిల్లా నుంచి టమాటా లోడుతో విజయనగరం వచ్చి అన్‌లోడ్ చేసి తిరిగి కి రాయి నిమిత్తం పెదతాడివాడ సమీపంలో గల ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్ద వేచి ఉన్న సమయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దాంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.