వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:10 AM
మండలంలోని దాసరిపేట గ్రామ సమీపంలో చెరువు గట్టుపై గల చె ట్టుకు ఓ వ్యక్తి ఉరి వేసుకున్నాడు.
దత్తిరాజేరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని దాసరిపేట గ్రామ సమీపంలో చెరువు గట్టుపై గల చె ట్టుకు ఓ వ్యక్తి ఉరి వేసుకున్నాడు. ఈ ఘట న శనివారం చోటుచేసుకుంది. పెదమానాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన మహంతి రామునాయుడు(45) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంత పనుల నిమిత్తం దత్తిరాజేరు మండలం దాసరిపేట గ్రామానికి వచ్చారు. అయి తే అక్కడ చెరువు గట్టు మీద చెట్టుకు ఉరివేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతుడికి భార్య రవణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.