Share News

వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:05 AM

కొత్తవలస పంచాయతీ ఉమాదేవి కాలనీకి చెందిన గంగవరపు గౌరి సత్యవరప్రసాద్‌(38) ఆదివారం మధ్యాహ్నం తమ్మన్నమెరక సమీపంలోని మామిడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

కొత్తవలస, జూలై6 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస పంచాయతీ ఉమాదేవి కాలనీకి చెందిన గంగవరపు గౌరి సత్యవరప్రసాద్‌(38) ఆదివారం మధ్యాహ్నం తమ్మన్నమెరక సమీపంలోని మామిడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతికి ఓ మహిళ కారణమని మృతుడి భార్య ఎర్నెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమాదేవి కాలనీకి చెందిన గంగవరపు గౌరి సత్యవరప్రసాద్‌, అతడి భార్య ఎర్నెమ్మ.. రాజన్న కాలనీ వద్ద ఇటుకల బట్టీ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు తోరణశ్రీ, శ్యామ్‌సుందర్‌ ఉన్నారు. మృతుడిది గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం. అక్కడ నుంచి 20 ఏళ్ల కింద కొత్తవలస మండలానికి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. ఓ మహిళతో సత్య వరప్రసాద్‌కు సాన్నిహిత్యం పెంచుకున్నాడు. దీంతో తన సంగతేంటో తేల్చి చెప్పాలని లేకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తరచూ బెదిరించేదని అతడి భార్య పోలీసులకు తెలిపింది. ఆదివారం కూడా సదరు మహిళ సత్య వరప్రసాద్‌కు ఫోన్‌ చేయడంతో సమీపంలోని మామిడి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడని తెలిపింది. వరప్రసాద్‌కు ఉరేసుకున్న విషయాన్ని సదరు మహిళ.. మృతుడి తమ్ముడికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో వరప్రసాద్‌ భార్య ఘటనా స్థలానికి వెళ్లింది. అప్పటికే భర్త మృతి చెందినట్టు గుర్తించింది. వరప్రసాద్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే అనుమా నాలుు వ్యక్తమవుతున్నాయి. విజయనగరానికి చెందిన చెందిన క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి పరిశీలించాయి. మృతుడి భార్య ఎర్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jul 07 , 2025 | 12:06 AM