Share News

విద్యాశాఖలో నూతన అధ్యాయం

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:06 AM

విద్యా శాఖలో నూతన అధ్యాయానికి మంత్రి నారా లోకేష్‌ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు.

విద్యాశాఖలో నూతన అధ్యాయం
సన్నబియ్యం అందిస్తున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి

శృంగవరపుకోట, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): విద్యా శాఖలో నూతన అధ్యాయానికి మంత్రి నారా లోకేష్‌ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. గురువారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందించారు. వీటితో పాటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. విద్య అంతే విలువైనదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే బియ్యం తినేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఒబ్బిన సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, మండల పార్టీ అధ్యక్షుడు జీఎస్‌నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొణదం మల్లేశ్వరరావు, నాయకులు జుత్తాడ రామసత్యం, చెక్క కిరణ్‌, అనకాపల్లి చెల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

విమాన ప్రమాదంపై దిగ్ర్భాంతి

అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. వైద్య కళాశాల వసతి భవనంపై కూలడం మహా విషాదమన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:06 AM