తప్పిన పెనుప్రమాదం
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:04 AM
వ్యాన్‌ను రైలు ఢీకొన్న ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
-అరగంట పాటు రైలు నిలిపివేత
దత్తిరాజేరు, జూలై1 (ఆంరఽధజ్యోతి): వ్యాన్‌ను రైలు ఢీకొన్న ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం లోని మరడాం సమీపంలో రైలు పట్టాల పక్కన వ్యాన్‌లో కూరగాయలు లోడ్ చేశారు. ఆ వ్యాన్‌ను వెనక్కి నడుపుతుండగా ఇటీవల కురిసిన వర్షాలకు నేల చిత్తడిగా ఉండటంతో బురదలో జారింది. వ్యాన్ వెనకభాగం పట్టాలకు చేరువైంది. వ్యాన్‌ను డ్రైవర్ రామునాయుడు వెనక్కి మళ్లించే క్రమంలో విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తున్న గూడ్స్ రైలు దాన్ని స్వల్పంగా ఢీకొంది. దీంతో అరగంట సమయం రైలు నిలిచింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.