Share News

రోడ్డు పక్కన వ్యక్తి మృతి

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:09 AM

భోగాపురం గ్రామంలోగల ఎత్తు బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నట్టు సీఐ దుర్గాప్రసాదు శని వారం తెలిపారు.

రోడ్డు పక్కన వ్యక్తి మృతి

భోగాపురం, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): భోగాపురం గ్రామంలోగల ఎత్తు బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నట్టు సీఐ దుర్గాప్రసాదు శని వారం తెలిపారు. ఈ ఘటనపై సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయ వాడకు చెందిన లారీ డ్రైవర్‌ వీరాస్వామి(60) శనివారం విజయవాడ నుంచి భోగాపురానికి లారీపై సామగ్రిని తీసుకు వచ్చారు. సామగ్రిని వేరే వాహనాల కు తరలించేందుకు శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే మార్గంలో లారీని నిలుపుదల చేశాడు. ఇంతలోనే అనారోగ్య కారణమో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ వీరాస్వామి తన లారీ పక్కన మృతిచెంది ఉన్నాడు. వాహన చోదకులు గమనించి, 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి, అప్పటి కే మృతిచెందినట్టు నిర్ధారించారు. దీనిపై వేరే లారీ డ్రైవర్‌ పల్నాడు జిల్లాకు చెం దిన కుంబ జోవేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 17 , 2025 | 12:09 AM