Share News

ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:53 PM

మండలంలోని బొడ్డవలస సమీపంలో 26వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు(59) మృతిచెందాడు.

ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని వ్యక్తి మృతి

డెంకాడ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవలస సమీపంలో 26వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు(59) మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పైడినా యుడు అయినాడ జంక్షన్‌ నుంచి తన ఇంటికి వెళ్లేందుకు బొడ్డవలస రోడ్డు దాటుతుండగా.. విశాఖపట్టణం నుంచి విజయనగరం వైపు వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఆయన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆయనకు బలమైన గాయా లు కావడంతో 108 వాహనంలో విజయన గరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల సమయంలో పైడినాయుడు మృతి చెందాడు. మృతునికి భార్య బంగారమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీళ్ల పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండవ కుమార్తెకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబానికి ఆసరాగా ఉన్న పైడినాయుడు మృతిచెందడంతో తమకు దిక్కె వరంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:53 PM