విద్యార్థులకు తప్పిన పెనుప్రమాదం
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:59 PM
డెంకాడలో ఓ ఆర్టీసీ, స్కూల్ బస్సు మంగళవారం ఢీకొన్న ఘటనలో పెనుప్రమాదం తప్పింది. దీంతో స్థాని కులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌ఐ సన్యాసినాయుడు కథ నం మేరకు.. డెంకాడలో ఓ ఇంగ్లీషు మీడియం స్కూల్ బస్సు నాతవలస వైపు నుంచి విజయనగరం వెళ్తోంది.
డెంకాడ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): డెంకాడలో ఓ ఆర్టీసీ, స్కూల్ బస్సు మంగళవారం ఢీకొన్న ఘటనలో పెనుప్రమాదం తప్పింది. దీంతో స్థాని కులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌ఐ సన్యాసినాయుడు కథ నం మేరకు.. డెంకాడలో ఓ ఇంగ్లీషు మీడియం స్కూల్ బస్సు నాతవలస వైపు నుంచి విజయనగరం వెళ్తోంది. అదే సమయంలో విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీబస్సు ఆ బస్సును ఢీకొంది.ఆ సమయం లో ఆర్టీసీబస్సులో 30 మంది ప్రయాణికులు, స్కూల్ బస్సులో 34 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యార్థులు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలైన విద్యార్థులను 108లో ప్రఽథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో విజయనగరం వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే లోకంనాగమాధవి సహాయ చర్యల్లో పాల్గొని విద్యార్థుల పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.