నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:46 PM
ప్రభు త్వం ఏర్పడి ఏడాది కాలంలో విజయనగరం పార్లమెంటు పరిధిలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు.
విజయనగరం రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం ఏర్పడి ఏడాది కాలంలో విజయనగరం పార్లమెంటు పరిధిలో ఎంతో అభివృద్ధి జరిగిందని, రానున్న నాలుగేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చెందనుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఆదివారం స్థానిక టీడీపీ కా ర్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే విజయనగరం, బొబ్బిలితో పాటు పలు నియోజకవర్గాల్లో స్థల పరిశీలన పూర్తవుతు న్నదన్నారు. ఒక్కొక్క డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కు రూ.2 కోట్లు వ్యయం అవుతున్నదని, ఈ వ్యయంలో ఇప్పటికే కోటి రూపాయల నిధులను ఎంపీ కోటాలో కేటాయించా మని, మిగతా నిధులను దాతల సహకారంతో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇక విజయనగరం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో స్పోర్ట్సు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామ న్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు రోడ్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. విజ యనగరం నుంచి పాలకొండ, రామభద్రపురం నుంచి బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగడ, రామభద్రపు రం బొబ్బిలి మీదుగా రాజాం, అదే విధంగా నెల్లిమర్ల, రామతీర్థం మీదుగా జాతీయ రహదారి కలుపుతూ రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్టు చెప్పారు. వీటితో పాటు జిల్లాలో ని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, ప్రసాదుల ప్రసాద్, కర్రోతు నర్సింగరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు బెవర భరత్, హుస్సేన్ పాల్గొన్నారు.