Share News

Smart Ration Cards స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో ఎంతో మేలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:17 PM

A Lot of Benefits with Smart Ration Cards జిల్లాలో 578 రేషన్‌ షాపులకు సంబంధించి 2.76 లక్షల స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కార్డుదారులకు వాటిని అందించారు.

  Smart Ration Cards స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో ఎంతో మేలు
స్మార్ట్‌ కార్డు అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 578 రేషన్‌ షాపులకు సంబంధించి 2.76 లక్షల స్మార్ట్‌ రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కార్డుదారులకు వాటిని అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా కార్డుదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా రేషన్‌ సరుకులను పొందొచ్చని తెలిపారు. స్మార్ట్‌కార్డు గుర్తింపు కార్డులా కూడా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సాలూరు మండ లంలో 8 వేల మందికి సామాజిక పింఛన్లు అందుతున్నాయని, కొత్తగా మరో 196 మంజూరు కానున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పనుల కోసం పొరుగు జిల్లాలకు వెళ్లిన వారు ఇక ప్రతినెలా రేషన్‌ కోసం స్వగ్రామాలకు వచ్చి ఇబ్బంది పడక్కర్లేదని తెలిపారు. స్మార్ట్‌ కార్డు ద్వారా స్థానికంగానే రేషన్‌ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించారు. ఇక వాట్సాప్‌ ద్వారా కూడా ఎన్నో సేవలు పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:18 PM