Share News

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:37 PM

): ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలని ఉద్దేశంతో వచ్చిన మావోయిస్టు నేతలను ఆసు పత్రి నుంచి తీసుకువెళ్లి ఎన్‌కౌంటర్‌ పేరిట చంపడం దుర్మార్గమని, తక్షణ మే న్యాయవిచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి కామేశ్వ రరావు డిమాండ్‌చేశారు.

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి
నిరసన తెలియజేస్తున్న సీపీఐ నాయకులు

విజయనగరం దాసన్నపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలని ఉద్దేశంతో వచ్చిన మావోయిస్టు నేతలను ఆసు పత్రి నుంచి తీసుకువెళ్లి ఎన్‌కౌంటర్‌ పేరిట చంపడం దుర్మార్గమని, తక్షణ మే న్యాయవిచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి కామేశ్వ రరావు డిమాండ్‌చేశారు. విజయనగరంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌లో సీపీఐ నియోజకవర్గకార్యదర్శి బుగత అశోక్‌ఆధ్వర్యంలో బూటకపు ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ చికిత్స కోసం నగరాలకు వచ్చిన మావోయిస్టులను పట్టుకుని అడవుల్లోకి తీసుకు వెళ్లి ఎదురుకాల్పులు పేరిట కాల్చి చంపడం దుర్మార్గమన్నారు.కార్యక్రమం లో సీపీఐ నేతలు అప్పలరాజు, వాసు, గౌరీశంకర్‌, ఇబ్రహీం, నాయుడు, సూరప్పడు, నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 11:37 PM