A Joint Strategy గంజాయిని అరికట్టేందుకు ఉమ్మడి వ్యూహం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:16 AM
A Joint Strategy to Curb Ganja గంజాయి రవాణా అరికట్టేందుకు ఇకపై ఆంధ్రా-ఒడిశా పోలీసులు ఉమ్మడి వ్యూహంతో పనిచేస్తారని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. మంగళవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్రాష్ట్రాల పోలీసుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సరిహద్దుల సమస్యలు, యంత్రాంగం బలోపేతం, సాధించిన విజ యాలు, ఇతర కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు చర్చించారు.
బెలగాం, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా అరికట్టేందుకు ఇకపై ఆంధ్రా-ఒడిశా పోలీసులు ఉమ్మడి వ్యూహంతో పనిచేస్తారని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. మంగళవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్రాష్ట్రాల పోలీసుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సరిహద్దుల సమస్యలు, యంత్రాంగం బలోపేతం, సాధించిన విజ యాలు, ఇతర కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు చర్చించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ.. ‘అల్లూరి జిల్లాలో 2021-22లో 7,515 ఎకరాల్లో ఉన్న గంజాయి సాగును ధ్వంసం చేశాం. ప్రస్తుతం 93 ఎకరాలకు తగ్గింది. 10,308 గ్రామాల్లో రైతులకు 28 రకాల మొక్కలు పంపిణీ చేశాం. 2023లో 553 కేసులు నమోదు చేశాం. 1764 మందిని అరెస్ట్ చేశాం. 393 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. 2024లో 652 కేసులు నమోదు చేసి 35,062 కేజీల గంజాయిని పట్టుకున్నాం. 2025లో 377 కేసులు నమోదు చేసి 22,207 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 1038 మందిని అరెస్ట్ చేశాం. 51 మందిపై పీడీ యాక్టు, 80 మందిపై పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టాన్ని ప్రయోగించాం. నిందితులకు చెందిన రూ.10.04 కోట్ల విలువైన ఆస్థులపై ఆర్థిక విచారణ నిర్వహించాం. సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. సరిహద్దు ప్రాంతాల్లో ఆశ్రయం పొంది, పరారీలో ఉన్న నిందితులు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చెక్‌పోస్టులను పునర్ వ్యవస్థీకరించాలి. కొఠియా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలి. ’ అని తెలిపారు. ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు అమిత్ బర్దార్, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.