జాబ్‌చార్ట్ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:43 PM
జాబ్‌చార్ట్ వెంటనే ఏర్పాటు చేయాలని సచివాలయాల ఉద్యోగుల సంఘ నాయకులు శంకరరావు కోరారు.
పార్వతీపురంటౌన్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): జాబ్‌చార్ట్ వెంటనే ఏర్పాటు చేయాలని సచివాలయాల ఉద్యోగుల సంఘ నాయకులు శంకరరావు కోరారు. బుధవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించా లని సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శంకరరా వు, తదితరులు మాట్లాడుతూ రేషనలైజేషన్‌కు సంబంధించి మిగులు ఉద్యో గుల వివరాలను తెలియజేయాలన్నారు. సచివాలయాల ఉద్యోగుల ప్రమోషన్ చానల్‌ను అన్ని శాఖలకు కల్పించాలన్నారు. తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్‌చెల్లించాలన్నారు. సచివాలయఉద్యోగుల సమస్యలపై కమిటీని ఏర్పాటు చేయాలనికోరారు.సచివాలయ శాఖకు చట్టబద్దత కల్పించాలన్నారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతపత్రాన్ని అందజేశారు.