Share News

a hostal in old building శిథిల భవనంలో హాస్టల్‌

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:03 AM

a hostal in old building ఆ వసతిగృహానికి ప్రభుత్వం నెలకు రూ.17 వేలు అద్దె చెల్లిస్తోంది. అంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందనుకుంటున్నారు కదూ సౌకర్యం తర్వాత భవనం పైకప్పు కూలకపోతే చాలని అక్కడి విద్యార్థినులు ఆవేదనతో చెప్పారు. స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని మహారాణిపేటలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతిగృహం శిథిలావస్థకు చేరింది.

a hostal in old building శిథిల భవనంలో హాస్టల్‌
శిథిలావస్థకు చేరుకున్న కళాశాల వసతిగృహం

శిథిల భవనంలో హాస్టల్‌

అవస్థలు పడుతున్న విద్యార్థినులు

ఏళ్లుగా పట్టించుకోని అధికారులు

విజయనగరం టౌన్‌, నవంబరు16(ఆంధ్రజ్యోతి):

ఆ వసతిగృహానికి ప్రభుత్వం నెలకు రూ.17 వేలు అద్దె చెల్లిస్తోంది. అంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందనుకుంటున్నారు కదూ సౌకర్యం తర్వాత భవనం పైకప్పు కూలకపోతే చాలని అక్కడి విద్యార్థినులు ఆవేదనతో చెప్పారు. స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని మహారాణిపేటలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతిగృహం శిథిలావస్థకు చేరింది. భవనంలో ఎటు చూసినా గోడలు బీటలువారి ప్రమాదకరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా అద్దెకొంపలో నిర్వహిస్తున్న ఈ వసతిగృహాంలో 30మంది బాలికలు ఉండేవారు. ప్రస్తుతం 18మంది వసతి పొందుతున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. తగినన్ని బెడ్‌లు లేవు. సిబ్బంది సరిగా వసతిగృహాంలో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా వరకు సీనియర్‌ విద్యార్థినులే నిర్వహణ చూస్తుంటారు. అక్కడ వసతి పొందుతున్న వారంతా ఇంటర్‌ విద్యార్థినులే. సూపరింటెండెంట్‌ లేరు. కుక్‌, వాచ్‌ఉమెన్‌, అటెండర్‌ను కూడా భర్తీ చేయలేదు. ఆయా, మేట్రిన్‌ మాత్రమే ఉంటున్నారు. హాస్టల్‌ పరిస్థితిని ఐసీడీఎస్‌ పీడీవిమలారాణి వద్ద ప్రస్తావించగా కళాశాల బాలికల వసతిగృహాం శిథిలావస్థకు చేరుకోవడం వాస్తవమేనని, అయితే భవనం మార్పుపై దృష్టి సారించామన్నారు. సిబ్బంది కొరత కూడా అధికంగానే ఉందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. సిబ్బంది సరిగా విధులకు రాకపోవడంపై పరిశీలిస్తామన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:03 AM