Share News

A Fine of ₹10,000 మాతో మాట్లాడితే రూ.10వేల జరిమానంట

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:20 AM

A Fine of ₹10,000 for Talking to Us ‘ చిల్లంగి నెపంతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ప్రాణ భయం ఉంది. పోలీసులు, అధికారులే మమ్మల్ని రక్షించాలి.’ అని సాలూరు మండలం గుర్రపువలస గిరిజన గ్రామానికి చెందిన పాలిక సన్యాసి వేడుకున్నాడు. సోమవారం తన కుటుంబంతో కలిసి కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చాడు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించాడు.

A Fine of ₹10,000   మాతో మాట్లాడితే రూ.10వేల జరిమానంట

ప్రాణ భయం ఉంది.. రక్షించండి

పీజీఆర్‌ఎస్‌లో వేడుకున్న ఓ కుటుంబం

బెలగాం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ చిల్లంగి నెపంతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ప్రాణ భయం ఉంది. పోలీసులు, అధికారులే మమ్మల్ని రక్షించాలి.’ అని సాలూరు మండలం గుర్రపువలస గిరిజన గ్రామానికి చెందిన పాలిక సన్యాసి వేడుకున్నాడు. సోమవారం తన కుటుంబంతో కలిసి కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చాడు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించాడు. ‘మా గ్రామంలో కొంతమంది వ్యక్తులు నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. చిల్లంగి నెపంతో ఊరి నుంచి బహిష్కరిస్తామంటున్నారు. ‘ఎవరైనా మాతో మాట్లాడితే రూ.10 వేలు జరిమానా కట్టాలని, పండుగలకు పిలవొద్దని ఊర్లో వారికి చెబుతున్నారు. జీడి తోటలో పని చేసుకుంటున్న నాపై ఇటీవల కొంతమంది దాడి చేశారు. ఊరి వదిలి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరించారు. పాఠశాలలో చదువుతున్న నా కొడుకు పిల్లలను కూడా ఎవరూ కలవద్దని చెబుతున్నారు.’ అని వాపోయాడు. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది.

Updated Date - Sep 23 , 2025 | 12:20 AM