Share News

రెండు కుటుంబాల మధ్య కొట్లాట

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:39 PM

ఇళ్ల ముందు మురుగునీటి వ్యవహారంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది.

రెండు కుటుంబాల మధ్య కొట్లాట

  • ఏడుగురికి గాయాలు

రాజాం రూరల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల ముందు మురుగునీటి వ్యవహారంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసింది. ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. పరస్పర ఫిర్యాదులతో ఇరువర్గాలకు చెందిన పదిమం దిపై రాజాం ఎస్‌ఐ ఉమామహేశ్వర్రావు కేసులు నమోదు చేశారు. రాజయ్యపే టలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ అందజేసిన వివరాలి లా ఉన్నాయి. వరుసకు అన్నదమ్ములైన కొండదాడి దాలెయ్య, కొండదాడి రాము కుటుంబాల మధ్య ఇంటి ముందు మురుగునీటి విషయంలో ఈనెల 28న రాత్రి చిన్నపాటి వివాదం తలెత్తింది. చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో ఇరువ ర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడుల్లో దాలెయ్య వర్గానికి చెందిన దాలెయ్య, ఆదెయ్య, రాములకు గాయాలయ్యాయి. మరోవర్గానికి చెందిన రాము, అన్నపూర్ణ, రమణమ్మ, లక్ష్మణ గాయాలపాలయ్యారు. దాలెయ్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై, రాము ఫిర్యాదు మేరకు మరో ఐదుగురిపై ఎస్‌ఐ ఉమామహేశ్వర రావు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:39 PM