Share News

కిటకిటలాడుతున్న పిల్లల వార్డు

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:32 AM

సీతంపేట ఏరియా ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డు జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది.

 కిటకిటలాడుతున్న పిల్లల వార్డు
చిన్నపిల్లల వార్డులో బెడ్లుపై రోగులు:

సీతంపేట రూరల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డు జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. విషజ్వరాలు గిరిపుత్రులపై పంజా విసురుతున్నాయి. సోమవారం ఏరియా ఆసుపత్రికి మొత్తంగా ఓపీ 203 వరకు రాగా వీటిలో 70మంది వైరల్‌ జ్వరాలతో చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయిం చారు. ఇన్‌పేషెంట్లుగా 34 మందిచేరారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. దీంతో ఒక్కోబెడ్‌పై ఇద్దరు చిన్నారులకు సిబ్బంది వైద్యసేవలు ం దిస్తున్నారు.ఆసుపత్రికివచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలంది స్తున్నట్లు పర్యవేక్షకుడు శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Aug 26 , 2025 | 12:32 AM