నిరసనల హోరు
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:58 PM
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు సంఘాల నాయకులు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ హోరెత్తిం ది.
కలెక్టరేట్ వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
బెలగాం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు సంఘాల నాయకులు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ హోరెత్తిం ది. మున్సిపల్ కార్మికులను తల్లికి వందనం పథకానికి అనర్హులుగా గుర్తించి అమలు చేయకపోవడం దారుణమ ని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మున్సి పల్ కార్మికులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గుమ్మలక్ష్మీపు రం రాయగడ జమ్ము గ్రామానికి చెందిన గిరిజన మహిళలు తమకు రావలసిన స్ర్తీనిధి రుణాలు తమకు తెలియకుండా తమ పేరున సీసీ సుమారు రూ.23 లక్షల వరకు అక్రమాలకు పాల్పడ్డారని, సీసీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీ కార్మికులు తమకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి జూలె ౖ9న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్న ట్లు తెలిపారు.
తల్లికి వందనం వర్తింపజేయాలి
పాలకొండ: మున్సిపల్, ఇంజనీరింగ్, పారిశుధ్యం, ఎన్‌ఎంఆర్ కార్మికులకు షరతులు లేకుండా తల్లికి వందనం పథకం వర్తింపజే యాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణా రావు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ రత్నంరాజుకు వినతిపత్రాన్ని అందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మున్సిపల్ కార్మిక సంఘాల యూనియన్ నాయకులు పి.వేణు, సీహెచ్.సంజీవి, విమల, పి.అప్పలకొండ తదితరులు ఉన్నారు.