Share News

వేగావతిపై చెక్‌డామ్‌ నిర్మించాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:13 AM

బాడంగి మండలం పాల్తేరు, బొబ్బిలి మండలం అలజంగి గ్రామాల మధ్య వేగావతి నదీ పరివాహక ప్రాం తంలో చెక్‌డ్యామ్‌ కమ్‌ కాజ్‌వేను నిర్మించాలని ఎమ్మెల్యే బేబీనాయన కోరారు.

వేగావతిపై చెక్‌డామ్‌ నిర్మించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బాడంగి మండలం పాల్తేరు, బొబ్బిలి మండలం అలజంగి గ్రామాల మధ్య వేగావతి నదీ పరివాహక ప్రాం తంలో చెక్‌డ్యామ్‌ కమ్‌ కాజ్‌వేను నిర్మించాలని ఎమ్మెల్యే బేబీనాయన కోరారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వేగావతి పరివాహక ప్రాంతంలో సుమారు 1,500 సాగునీటి బోర్లు ఉన్నాయన్నారు. బాడంగి మండలానికి చెందిన 18 గ్రామాలకు, గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలానికి చెందిన 55 గ్రామాలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు సీపీడబ్ల్యూఎస్‌ పథకం ఉందని చెప్పారు. అటు తాగునీటి అవసరాలను, ఇటు సాగునీటి అవసరాల ను తీర్చుతున్న వేగావతి నదిలో భూగర్భ జలాలను వృద్ధి చెందించేందుకు అక్కడ చెక్‌డ్యామ్‌ కమ్‌ కాజ్‌వేను నిర్మించాలని ఆయన కోరారు.

Updated Date - Mar 21 , 2025 | 12:13 AM