Share News

Vamsadhara! వంశధారపై వంతెన!

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:00 AM

A Bridge Over the Vamsadhara! భామిని మండలం లివిరి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు 46 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఏపీ నుంచి అనుమతులు మంజూరు కావల్సి ఉంది.

 Vamsadhara!  వంశధారపై వంతెన!
లివిరి గోపీనాథ ఆలయం

  • రూ.46 కోట్లు మంజూరు

భామిని, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భామిని మండలం లివిరి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు 46 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఏపీ నుంచి అనుమతులు మంజూరు కావల్సి ఉంది. గజపతిరాజుల ఇష్టదైవం.. వారు నిర్మించిన గోపీనాఽథ ఆలయం లివిరిలో ఉంది. ఇక్కడకు గజపతిరాజుల వారసులతోపాటు ఒడిశా నుంచి ఎక్కువగా భక్తులు వస్తుంటారు. హోలీ ఉత్సవాలకు పర్లాకిమిడి, కాశీనగర్‌, గుణుపూర్‌ తదితర ప్రాంతాల నుంచి జనం తలివస్తుంటారు. కాగా అప్పట్లో నౌపడ నుంచి గుణుపూర్‌ వరకు నడిచే నేరోగేజ్‌ రైలు ప్రయాణికులు, భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. అయితే కాలక్రమంలో ఆ రైలు మార్గం బ్రాడ్‌ గ్రేజ్‌ మారింది. దీంతో ఒడిశా భక్తులు వంశధార నది దాటి లివిరి ఆలయానికి చేరుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆంధ్రా-ఒడిశాను రవాణా మార్గాన్ని అనుసంధానం చేస్తూ వంశధారపై వంతెన నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గజపతి జిల్లా కాశీనగర్‌ బ్లాక్‌ పరిధిలో ఉన్న బొత్తవ నుంచి వంశధార నది లివిరి గ్రామం వరకు వంతెన నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఇరు రాష్ర్టాల నదీతీర ప్రాంతవాసులకు పడవ ప్రయాణం తప్పుతుంది.

Updated Date - Dec 03 , 2025 | 12:00 AM