A Boom Time for Roads! రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:00 PM
A Boom Time for Roads! జిల్లాలో పలుచోట్ల రహదారుల నిర్మాణాలు, శాశ్వత మరమ్మతు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 14.5 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.14.5 కోట్లతో మరమ్మతులు, నిర్మాణాలకు చర్యలు
పార్వతీపురం, అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల రహదారుల నిర్మాణాలు, శాశ్వత మరమ్మతు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 14.5 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. కాగా జిల్లాలో సాలూరు నుంచి దుగ్గేరుకు వెళ్లే రహదారి అధ్వానంగా మారిన నేపథ్యంలో ఆ మార్గంలో కొంతభాగం శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరి కొంత భాగంలో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.5.50కోట్లు మంజూరు చేసింది. ఇక కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం రహదారి అభివృద్ధి పనులకు రూ.మూడు కోట్లు కేటాయించారు. కురుపాం నియోజకవర్గంలో కడగండి-బొమ్మిక రహదారి పనుల కోసం రూ.3.45 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
వైసీపీ హయాంలో..
వైసీపీ హయాంలో ఉమ్మడి జిల్లాలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. పూర్తిగా రూపం కోల్పోయాయి. గోతుల్లో దారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. చివరకు చేతులు ఎత్తేసింది. రోడ్డుపైకి వచ్చిన వాహనం గమ్యస్థానానికి వెళ్లేవరకూ ఒకటే ఆందోళన. దీంతో ప్రజలు నరకయాతన పడ్డారు. అయితే తాము అధికారంలోకి వస్తే రహదారులను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు రహదారులను బాగుచేసేందుకు నిధులు విడుదల చేశారు. రోడ్డు నిర్మాణాలను పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని నిర్ణయించారు. దీంతో చిలక పాలెం-రాజాం-జైపూర్ రోడ్డు, అలికాం-పార్వతీపురం- రాయగడ రోడ్ల నిర్మాణంతో ఉమ్మడి జిల్లావాసుల కష్టాలు తీరుతాయి.