Share News

Snow Over the Hills మన్యంపై మంచు దుప్పటి

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:45 PM

“A Blanket of Snow Over the Hills సీతంపేట ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేస్తోంది. మన్యం వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్దిరోజుల నుంచి మంచు, చలి తీవ్రత పెరిగింది. తెల్లవారు జామున దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Snow Over the Hills మన్యంపై మంచు దుప్పటి
సీతంపేట వారపు సంతలో చలి మంట కాగుతున్న గిరిజనులు

వణుకుతున్న ప్రజలు

సీతంపేట రూరల్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేస్తోంది. మన్యం వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్దిరోజుల నుంచి మంచు, చలి తీవ్రత పెరిగింది. తెల్లవారు జామున దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించని పరిస్థితి. దీంతో లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. మరోవైపు సాయంత్రం 4గంటలకే చలిగాలులు వీస్తుండడంతో ఆరుబయటకు రావాలంటేనే గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక వారపుసంతకు వచ్చే గిరిపుత్రులు చలితీ వ్రతను తట్టుకోలేక అగ్గిమంట వేసుకుంటున్నారు. సీతంపేట ఏజెన్సీలో ఈ ఏడాది ఉన్నంత చలి ఎప్పుడూ లేదని వారు వాపోతున్నారు. మొత్తంగా ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి మన్యంలో కనిపించడం లేదు.

Updated Date - Dec 29 , 2025 | 11:45 PM