Share News

94 శాతం పూర్తి

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:17 PM

జిల్లాలో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 94 శాతం పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

 94 శాతం పూర్తి
చెరుకుపల్లి వద్ద వరినాట్లు వేస్తున్న రైతు కూలీలు

జిల్లాలో జోరుగా సాగుతున్న వరినాట్లు

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 94 శాతం పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా వరి సాగయ్యే అవకాశాలున్నాయని తెలియజేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా కరుస్తున్న వర్షాలు ఖరీఫ్‌ పంటలకు ఊపిరిపోశాయి. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మన్యంలో మొత్తంగా 1,78,423 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. ఇప్పటి వరకు 1,68,153 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి.

నారు తెచ్చి.. నాట్లు వేసి

5-bhm-1.gif

ట్రాక్టర్‌ నుంచి నారు దించుతున్న దృశ్యం

భామిని, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పసుకుడి గ్రామంలో పలువురు రైతులు ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో నారు తీసుకువచ్చి శుక్రవారం నాట్లు వేశారు. వర్షాభావం కారణంగా తమ వరి నారు ఎండిపోయిందని, అయితే, ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో ఇతర ప్రాంతాల నుంచి నారును గ్రామానికి తీసుకువచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ఆలస్యమైనా సుమారు పది ఎకరాలు నాటేందుకు సిద్ధమైనట్టు బోదెపు అప్పలనాయుడు, రామినాయుడు పేర్కొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 11:17 PM