Share News

Pension 90 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:36 PM

90% Pension Distribution జిల్లాలో పింఛన్ల పంపిణీ యథావిధిగానే నిర్వహించారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్‌ సొమ్ము అందించారు. మొత్తంగా 1,40,401 మందికి గాను తొలిరోజు 1,26,388 మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు.

 Pension   90 శాతం పింఛన్ల పంపిణీ
సాలూరలో పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి సంధ్యారాణి

గరుగుబిల్లి/సాలూరు,సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పింఛన్ల పంపిణీ యథావిధిగానే నిర్వహించారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్‌ సొమ్ము అందించారు. మొత్తంగా 1,40,401 మందికి గాను తొలిరోజు 1,26,388 మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు. వీరి కోసం ప్రభుత్వం రూ. 59.91 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా జిల్లాలో 90 శాతం మేర పంపిణీ పూర్తయ్యింది. కాగా పింఛన్‌ సొమ్ము అందడంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అక్టోబరు నెల నుంచి మార్పులు జరిగే అవకాశం ఉంది. సాలూరు పట్టణంలోని 3వ వార్డు గుమడాంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల ముంగిటకే పింఛన్లు అందిస్తుందని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం అదే వార్డులో స్వామివివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సీఎం చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు

సాలూరు, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాలూరు పట్టణంలోని 21వ వార్డులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. 1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పదవీప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైటెక్‌ సిటీ నుంచి నేటి ‘స్వర్ణాంధ్ర విజన్‌ -2047’ వరకు చేపట్టే ప్రతి ప్రాజెక్టూ ఆయన ముందుచూపునకు దర్పణాలేనని తెలిపారు. సంక్షోభాలకు ఎదురీది.. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన నైజమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు (చిట్టి), కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:36 PM