Share News

70% There.. Only 50% Here! అక్కడ 70..ఇక్కడ 50 శాతమే!

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:06 AM

70% There.. Only 50% Here! జిల్లాలో సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతుల నిర్మా ణాలు కొలిక్కి రావడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. పనులు పూర్తికావడం లేదు. నత్తనడకనే నిర్మా ణాలు సాగుతుండడంపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు.

70% There.. Only 50% Here! అక్కడ 70..ఇక్కడ 50 శాతమే!
పార్వతీపురంలో 50 శాతం పూర్తయిన ఆసుపత్రి భవన నిర్మాణం

గత వైసీపీ సర్కారు హయాంలో మంజూరు

బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం..

నాడు సీతంపేటలో ప్రారంభించినా.. పార్వతీపురంలో పునాది వేయని వైనం

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పనుల్లో కదలిక

అందుబాటులోకి వస్తే.. గిరిబిడ్డల కష్టాలు తీరినట్టే..

పూర్తిస్థాయిలో అందునున్న ఆధునిక వైద్య సేవలు

పార్వతీపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతుల నిర్మా ణాలు కొలిక్కి రావడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. పనులు పూర్తికావడం లేదు. నత్తనడకనే నిర్మా ణాలు సాగుతుండడంపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో ఒక్కో ఆసుపత్రిని మంజూరు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి నుంచి వర్చువల్‌గా వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు చెరో 48 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే వైసీపీ సర్కారు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, ఇతరత్రా కారణాలతో పనులు మందకొడిగా సాగాయి. సీతంపేటలో 70 శాతం వరకూ పూర్తవ్వగా.. పార్వతీపురంలో పనులే ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం 50 శాతం పూర్తయ్యింది. ఈ రెండు ఆసుపత్రులకు అందుబాటులోకి వస్తే ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వాటిపై దృష్టిసారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో ఉండే అధికశాతం మంది గిరిజనులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. గిరిశిఖర గ్రామాల ప్రజల పరిస్థితి మరీ దయనీయం. అత్యవసర వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రత్యేక వైద్య నిపుణులు, ఇతర పరికరాలు లేకపోవడంతో పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి, పాలకొండ, సాలూరు, సీతంపేట ఏరియా ఆసుపత్రుల నుంచి కూడా ఎక్కువగా కేసులు రిఫరల్‌ అవుతున్నాయి. దీంతో రోగులు వ్యయప్రయాసలకు గురై విశాఖ, విజయనగరం చేరుకోవాల్సి వస్తోంది. ఇటువంటి సమయాల్లో ఎంతోమంది మృత్యు వాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతులు అందు బాటులోకి వస్తే.. మన్యంలో గిరిజన, మైదాన ప్రాంతవాసుల కష్టాలు తీరుతాయి. మరోవైపు జిల్లాకు సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామస్థులకు కూడా అధునాతన వైద్య సేవలు అంద నున్నాయి. ఇక్కడి నుంచి రిఫరల్‌ కేసులు కూడా బాగా తగ్గుతాయనే వ్యాఖ్యలు సర్వత్రా విని పిస్తున్నాయి. దీనిపై ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సిమ్మన్నను వివరణ కోరగా.. ‘సీతంపేటలో ఆసుపత్రి నిర్మాణం ఈ ఏడాది డిసెంబరుకు పూర్తవుతుంది. బిల్లులు పెండింగ్‌లో లేవు. చెల్లింపులన్నీ పూర్తయ్యాయి. రన్నింగ్‌ ఆసుపత్రి పనులు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు మల్టీ సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణం చేపడతారు.’ అని తెలిపారు.

Updated Date - Jul 27 , 2025 | 12:06 AM