‘Sukanya Samriddhi’ 45 వేల ‘సుకన్య సమృద్ధి’ ఖాతాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:55 PM
45,000 ‘Sukanya Samriddhi’ Accounts జిల్లాలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు 45వేలకు చేరాయని పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్.బాబూరావు తెలిపారు. పట్టణంలో పోస్టల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ముందుగా రికార్డులు తనిఖీ చేశారు.
సాలూరు, అక్టోబరు15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు 45వేలకు చేరాయని పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్.బాబూరావు తెలిపారు. పట్టణంలో పోస్టల్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ముందుగా రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పార్వతీపురం, బొబ్బిలిలో 405 బ్రాంచి పోస్టాఫీ సులు, 38 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయన్నారు. ఆడ పిల్లల కోసం కేంద్ర సర్కారు ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన పథకం అమలులోకి తెచ్చిందని వెల్లడించారు. రూ.250తో ఖాతా ప్రారంభించొచ్చని, 15 సంవత్సరాల వరకు ఎంతో కొంత కట్టొచ్చని తెలిపారు. ఆ తర్వాత 8.2 వడ్డీరేటుతో అసలు మొత్తాన్ని చెల్లిస్తారన్నారు. చదువు, పెళ్లికోసమైతే మధ్యలోనే ఆ నగదు ఇస్తారని వివరించారు. ఇప్పటివరకు 3 లక్షలకుపైగా రికరింగ్ డిపాజిట్లు కలిగి ఉన్నట్లు చెప్పారు.పార్వతీపురం, చీపురుపల్లిలో ఏటీఎంలను నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.