నాగావళిలోకి 4,500 క్యూసెక్కుల వరద
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:26 AM
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కొద్దిరోజు లుగా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి 4,500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరుతోంది.
గరుగుబిల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కొద్దిరోజు లుగా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి 4,500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరుతోంది. శనివారానికి తోటపల్లి ప్రా జెక్టు 105 మీటర్లకు గాను 104.08 మీటర్ల మేర నిల్వ సామర్థ్యం నెలకొంది. ఎగువ నుంచి 4,500 క్యూసెక్కుల నీరు చేరుగా, స్పిల్‌వే నుంచి దిగువకు 3,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రధాన కాలువల నుంచి 1,220 క్యూసెక్కుల సాగునీటిని సరఫరా చేస్తున్నా రు. ఒడిశాలో అధికంగా వర్షాలు కురిస్తే వరద ప్రవాహం పెరిగే పరిస్థితి ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.