Share News

Medical Camps 339 ప్రత్యేక వైద్య శిబిరాలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:26 PM

339 Special Medical Camps ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 339 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో స్టేట్‌ నోడల్‌ అధికారి పి.గీతాపద్మజ, ప్రోగ్రాం అధికారులతో సమీక్షించారు. నేటి నుంచి అక్టోబరు 2 వరకు జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి నిర్దేశించిన ఆరోగ్య పరీక్షలు, వైద్యసేవలు అందించాలన్నారు.

 Medical Camps  339 ప్రత్యేక వైద్య శిబిరాలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 339 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు తెలిపారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో స్టేట్‌ నోడల్‌ అధికారి పి.గీతాపద్మజ, ప్రోగ్రాం అధికారులతో సమీక్షించారు. నేటి నుంచి అక్టోబరు 2 వరకు జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి నిర్దేశించిన ఆరోగ్య పరీక్షలు, వైద్యసేవలు అందించాలన్నారు. షెడ్యూల్‌ ప్రకారం స్పెషలిస్టు వైద్యులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అక్కడకు ముందుగా చేరుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌, రక్తహీనత గుర్తించే టెస్ట్‌లు, గర్భిణులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. పోషకాహార ఆవశ్యకత, ఆరోగ్య జాగ్రత్తలపై కౌన్సెలింగ్‌ ఇవ్వాలని క్షయ నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఐవో విజయమోహన్‌, ప్రోగ్రాం అధికారులు టి.జగన్మోహన్‌రావు, రఘు, వినోద్‌, కౌశిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:26 PM