3 kilometers in Doli.. 3 కిలోమీటర్లు డోలీలో..
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:59 PM
3 kilometers in Doli.. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఆ కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. మూడు కిలోమీటర్లు రాళ్లు, పొదలు, ఆపై కాలువ గట్లపై నుంచి నడిచారు. కష్టమైనా.. భారమైనా రహదారి లేక అవస్థలు పడుతూనే ఆమెను ప్రధాన రహదారి వద్దకు చేర్చారు.
3 కిలోమీటర్లు డోలీలో..
పొలం గట్ల మీదుగా మహిళను మోసుకెళ్లిన గిరిజనులు
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఆ కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. మూడు కిలోమీటర్లు రాళ్లు, పొదలు, ఆపై కాలువ గట్లపై నుంచి నడిచారు. కష్టమైనా.. భారమైనా రహదారి లేక అవస్థలు పడుతూనే ఆమెను ప్రధాన రహదారి వద్దకు చేర్చారు.
మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని మోసాయివలన గ్రామానికి చెందిన చోడిపల్లి ఆశమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు వారం కిందట కేజీహెచ్‌లో ఆపరేషన్ అయింది. కుట్లు తొలగించేందుకు వైద్యులు మరోసారి రమ్మని చెప్పారు. ఇందుకోసం బుధవారం విశాఖకు బయలుదేరగా గ్రామం నుంచి ప్రధాన రహదారి వరకు ఎలాంటి రోడ్డు లేదు. కుటుంబ సభ్యులు చేసేదిలేక డోలీ కట్టారు. ఉదయానే గ్రామం నుంచి బయలుదేరారు. మూడు కిలోమీటర్ల దూరంలో పొదలను, పొలం గట్లను దాటుకుని నారసింహునిపేట వద్దకు చేర్చారు. అక్కడున్న వాహనంలో విశాఖపట్నం తరలించారు. దశాబ్దాలు గడిచినా గిరిజనుల బతుకులు మారడం లేదని, మౌలిక సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, కనీసం రోడ్డు వేయడానికి కూడా పాలకులు ముందుకు రాకపోవడం అన్యాయమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.