Share News

Malaria మలేరియా పాజిటివ్‌ 17

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:34 AM

17 Malaria Cases Reported Positive సీతంపేట ఏరియా ఆసుపత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. మొత్తంగా 382 వరకు ఓపీ నమోదైంది. వీరిలో జ్వరాలతో బాధపడుతున్న వారు 99మంది వరకు ఉన్నారు.

 Malaria మలేరియా పాజిటివ్‌ 17
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవల కోసం వేచి ఉన్న రోగులు

సీతంపేట రూరల్‌, ఆగస్టు4 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. మొత్తంగా 382 వరకు ఓపీ నమోదైంది. వీరిలో జ్వరాలతో బాధపడుతున్న వారు 99మంది వరకు ఉన్నారు. మలేరియా పాజిటివ్‌ కేసులు 17 వరకు వచ్చాయి. ఇందులో 42మంది రోగులు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. వీరికి ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Aug 05 , 2025 | 12:34 AM