Share News

145 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:17 AM

మండలంలోని గొల్జాం జంక్షన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో 145 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎల్‌.అప్పలనాయుడు తెలిపారు.

145 కిలోల గంజాయి స్వాధీనం

లక్కవరపుకోట, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్జాం జంక్షన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో 145 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎల్‌.అప్పలనాయుడు తెలిపారు. ముందుగా అందిన సమాచా రం మేరకు ఎస్‌ఐ నవీన్‌పడాల్‌, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ తనిఖీల్లో ఒక వాహనాన్ని పట్టుకుని, తనిఖీ చేయగా, 145 కిలోల గంజాయిని గుర్తించామని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కేరళకు చెందిన మహమ్మద్‌ షఫీ, ఒడిశాకు చె ందిన డుంబూలను అరెస్టు చేశామని ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ తెలిపారు. వీరిని శనివారం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

Updated Date - Aug 02 , 2025 | 01:17 AM