Suffer from Common Fevers 14 మందికి సాధారణ జ్వరాలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:10 AM
14 People Suffer from Common Fevers సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో 14 మంది సాధారణ జ్వరాలతో బాధపడుతున్నారని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శుక్రవారం సాలూరు ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించారు.
పార్వతీపురం/సాలూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో 14 మంది సాధారణ జ్వరాలతో బాధపడుతున్నారని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. శుక్రవారం సాలూరు ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ.. వివిధ ఆశ్రమ పాశాలలకు చెందిన మొత్తం 18 మంది విద్యార్థులు స్వల్ప అనారోగ్య సమస్యలతో సాలూరు ఏరియా ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. 21 మంది పచ్చకామెర్లతో బాధపడుతున్న జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇద్దరికి జాండీస్ లక్షణాలు ఉండగా..వారిలో ఒకరి పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జి చేశామని తెలిపారు. మిగతా పిల్లలందరూ బాగానే ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రి సంధ్యారాణి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్‌వో, ఇతర వైద్యాధికారులతో సమీక్షించారు.
మరో 12 మంది ఇళ్లకు ..
బెలగాం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పచ్చకామెర్లతో పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకులం, ఏకలవ్య పాఠశాల విద్యార్థినులు కోలుకుంటున్నారు. శుక్రవారం మరో 12 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 24 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్‌లోమరో ముగ్గురు వైద్య సేవలు పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.