Constables Selected 133 మంది కానిస్టేబుళ్లగా ఎంపిక
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:55 PM
133 Constables Selected పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తుది ఫలితాలు విడుదల చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి 133 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
పార్వతీపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తుది ఫలితాలు విడుదల చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి 133 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మన్యం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది ఉత్తమ ప్రతిభ చూపారు. గిరిపుత్రులు కూడా కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపికయ్యారు. బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కానిస్టేబుళ్లగా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి సెప్టెంబరు నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.