12 మంది బైండోవర్
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:54 PM
అనధికారంగా గతంలో మద్యం విక్రయించి పట్టుబడిన 12 మంది పాత నేరస్తులపై బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం- 2023 సెక్షన్ 129 కింద రాజాం తహసీల్దార్, మండల మేజిస్ట్రేట్ రాజశేఖర్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు రాజాం ఎక్సైజ్ సీఐ జైభీం తెలిపా రు.
రాజాంరూరల్,సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి):అనధికారంగా గతంలో మద్యం విక్రయించి పట్టుబడిన 12 మంది పాత నేరస్తులపై బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం- 2023 సెక్షన్ 129 కింద రాజాం తహసీల్దార్, మండల మేజిస్ట్రేట్ రాజశేఖర్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు రాజాం ఎక్సైజ్ సీఐ జైభీం తెలిపా రు. ఈమేరకు నిందితులకు లక్ష రూపాయల పూచీకత్తుపై ఏడాది కాలానికి బైండోవర్ చేసినట్లు చెప్పారు. బుధవారం రాజాం ఎక్సైజ్ సర్కిల్ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్‌లో అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.