Share News

Lok Adalat లోక్‌ అదాలత్‌లో 116 కేసుల రాజీ

ABN , Publish Date - Jul 05 , 2025 | 10:38 PM

116 Cases Settled in Lok Adalat జాతీయ లోక్‌ అదాలత్‌లో 116 కేసులు రాజీ అయినట్లు రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్‌.దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు.

  Lok Adalat లోక్‌ అదాలత్‌లో 116 కేసుల రాజీ
లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న రెండో అదనపు జిల్లా న్యాయాధికారి

బెలగాం, జూలై 5(ఆంధ్రజ్యోతి) : జాతీయ లోక్‌ అదాలత్‌లో 116 కేసులు రాజీ అయినట్లు రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్‌.దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్‌ బౌన్స్‌లు-3, ఐపీసీ-60, మైంటెనెన్సు-1, విడాకులు -1, మోటారు యాక్సిడెంట్‌ -3, సివిల్‌ దావాలు-4, ఎక్సైజ్‌ -28, ప్రిలిటిగేషన్‌-1 ఇతరత్రా 16 కేసులు రాజీ అయ్యాయి. పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్‌ అదాలత్‌ మంచి వేదికని ఆయన తెలిపారు. సివిల్‌, క్రిమినల్‌, మోటార్‌ ప్రమాద పరిహార కేసులు, పలు వివాదాలను పరిష్కరించడం శుభపరిణామమన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసలకు గురవడం కంటే రాజీ ద్వారా కేసులను పరిష్కరించడం ఉత్తమ మార్గమని వెల్లడించారు. దీనివల్ల డబ్బు, సమయం ఆదా అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ జె.సౌమ్యా జాస్ఫిన్‌, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.చంద్ర కుమార్‌, బార్‌ ప్రెసెడెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 10:38 PM