Share News

100% Results శతశాతం ఉత్తీర్ణతకు వంద రోజుల ప్రణాళిక

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:06 AM

100-Day Plan for 100% Results జిల్లాలో పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ వందరోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గత మూడేళ్లు టెన్త్‌ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.

 100% Results శతశాతం ఉత్తీర్ణతకు వంద రోజుల ప్రణాళిక

  • టెన్త్‌ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం

పార్వతీపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ వందరోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గత మూడేళ్లు టెన్త్‌ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా అదే స్థానం కైవసం చేసుకోవాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ విద్యార్థులను, ఉపాధ్యాయులను పరీక్షలకు సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహి స్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సబ్జెక్ట్‌లపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం చది విస్తూ.. విద్యార్థులకు అవసరమైన సలహా, సూచనలు అందిస్తున్నారు. మొత్తంగా ప్రైవేట్‌కు దీటుగా ఫలితాలు సాధించేందుకు అధికారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమించారు. పిల్లల చదువులతో పాటు వారి ఆరోగ్యాలపై పర్యవేక్షణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో 187 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు పది వేల మంది విద్యార్థులు ఈ సారి టెన్త్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పాఠశాలల్లో ఈ నెల ఆరో తేదీ నుంచే వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా హెచ్‌ఎంలు సబ్జెక్టు ఉపాధ్యా యులతో సమావేశం నిర్వహించాలి. రోజువారీ బోధన, తదితర అంశాలకు చెందిన షెడ్యూల్‌ తయారుచేయాలి. రోజూ నిర్వహించే పరీక్షల ఫలితాలను సాయంత్రం లోపు లీప్‌ యాప్‌లో నమోదు చేయాలి. విద్యార్థులను లెవెల్‌ వన్‌, లెవెల్‌-2గా విభజించాలి. ప్రశ్నాపత్రాలను జిల్లా కార్యాలయం నుంచి రోజూ వాట్సాప్‌ ద్వారా పంపిణీ చేయాలి. ఎంఈవోలు, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సి ఉంది. ‘పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈ మేరకు వంద రోజుల ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నాం. మరోసారి ఉత్తమ ఫలితాలు సాధించి.. జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుం టున్నాం.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 08 , 2025 | 12:06 AM