Share News

100-Bed Hospital మరో నెలరోజుల్లో అందుబాటులోకి వంద పడకల ఆసుపత్రి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:13 AM

100-Bed Hospital to be Ready in Another Month సాలూరు వంద పడకల ఆసుపత్రి మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం ఆమె ఆసుపత్రి పనులను పరిశీలించారు. అన్ని ఫ్లోర్లను తనిఖీ చేశారు.

  100-Bed Hospital  మరో నెలరోజుల్లో  అందుబాటులోకి వంద పడకల ఆసుపత్రి
ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సాలూరు వంద పడకల ఆసుపత్రి మరో నెలరోజుల్లో అందుబాటులోకి రానుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం ఆమె ఆసుపత్రి పనులను పరిశీలించారు. అన్ని ఫ్లోర్లను తనిఖీ చేశారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేసి పూర్తిస్థాయి వసతులతో ఆసుపత్రిని ప్రారంభించాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీపడాల్సిన పనిలేదని తెలిపారు. ఇది వినియోగంలోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలు, గిరిజనుల కష్టాలు తీరుతాయన్నారు. ఆమె వెంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు, నాయకులు పరమేశు, వేణుగోపాలనాయుడు, యుగంధర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 12:13 AM