Share News

పారిశుధ్య కార్మికులు సమ్మెకు నోటీసు

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:01 AM

సమస్యలను పరిష్కరించాలనిపారిశుధ్య కార్మి కులు వచ్చేనెల తొమ్మిదోతేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి తెలిపారు.

   పారిశుధ్య కార్మికులు సమ్మెకు నోటీసు
ఈవో శ్రీనివాస్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

గజపతినగరం,జూన్‌24(ఆంధ్రజ్యోతి):సమస్యలను పరిష్కరించాలనిపారిశుధ్య కార్మి కులు వచ్చేనెల తొమ్మిదోతేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి తెలిపారు.ఈ మేరకు మంగళవారం పారి శుధ్యకార్మికులు గజపతినగరం,పురిటిపెంట గ్రామసచివాలయాల్లో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈసందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ లేబర్‌ కోడ్లను రద్దు చేయా లని, కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కనకరాజు,కోటేశ్వరరావు,గోవింద, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:01 AM