VIT AP Celebrates 79th Independence Day: వీఐటీ ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:31 AM
వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ యూనివర్సిటీలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు...
ప్రజల ప్రాణాలు కాపాడిన 9 మందికి సత్కారం
సమాజానికి సేవ చేసేవారిని గుర్తించి గౌరవించడం సామాజిక బాధ్యత: వీసీ డాక్టర్ ఎస్.వి.కోటా రెడ్డి
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఏపీ యూనివర్సిటీలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డబ్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ (విశాఖపట్నం, హైదరాబాద్) ఆర్.ఎల్.నారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటా రెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి ేసవలందించే వారిని గుర్తించి, గౌరవించడమనేది విద్యాసంస్థల సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో సమాజానికి నిస్వార్థంగా సేవలందించిన వారిని సత్కరించడం తమకు గర్వకారణమని చెప్పారు. క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో రాణించిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్, ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలకు చెందిన 9 మంది సిబ్బందిని యూనివర్సిటీ ఘనంగా సత్కరించింది. ప్రజా భద్రత, రక్షణ, సేవా విభాగాల్లో విశేష కృషి చేసిన వారికి జ్ఞాపికతో పాటు రూ. 25,000 నగదు బహుమతిని ఆర్.ఎల్. నారాయణ అందజేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి నిడదవోలు గోపాలకృష్ణ (ఇన్‌స్పెక్టర్, 10వ బెటాలియన్), కమ్మరి లోకేశ్ చారి (హెడ్ కానిేస్టబుల్, 10వ బెటాలియన్) పలువురి ప్రాణాలను కాపాడినందుకు ఈ అవార్డులు అందుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి మట్టా వెంకట రమణ (కండక్టర్), ఎస్.కె.ఎం.రసూల్(మృత-డ్రైవర్), భాస్కర్ (మృత-డ్రైవర్), మునియహ్ కన్చని-(డ్రైవర్) విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలను గమ్యానికి సురక్షితంగా చేర్చినందుకు అవార్డులు అందుకున్నారు. ఏపీ ేస్టట్ డిజాస్టర్ రెస్పాన్స్ ్క్ష ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ కి చెందిన పుటికం హేమ శ్రీకాంత్ రెడ్డి (ఫైర్‌మన్), యల్లావుల వెంకటేశ్వర్లు (స్టేషన్ ఫైర్ ఆఫీసర్), అంజనేయులు జక్కంపూడి (అసిస్టెంట్ డిస్ర్టిక్ట్ ఫైర్ ఆఫీసర్) అత్యవసర పరిస్థితుల్లో ధైర్య సాహసాలు చూపినందుకు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డా. జగదీశ్ చంద్ర ముదిగంటి (రిజిస్ర్టార్), డా.ఎ్‌సకె ఖదీర్ పాషా (డిప్యూటీ డైరెక్టర్, స్టూడెంట్ వెల్ఫేర్)తో పాటు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, అతిథులు పాల్గొన్నారు.
అగ్రి బీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(హానర్స్)) కమ్యూనిటీ సైన్స్, ఎన్నారై కోటాలో బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్ కోర్సు(2025-26)ల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు రిజిస్ర్టార్ రామచంద్రరావు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు.