VIT AP Balotsav: వీవీఐటీయూ నేటి నుంచి బాలోత్సవ్
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:05 AM
ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీయూ బాలోత్సవ్ 2025 సాంస్కృతిక ఉత్సవాలకు గుంటూరు సమీపంలోని.....
పెదకాకాని, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీయూ బాలోత్సవ్ 2025 సాంస్కృతిక ఉత్సవాలకు గుంటూరు సమీపంలోని నం బూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలిజికల్ యూనివర్సిటీ ప్రాంగణం సిద్ధమైంది. శుక్రవారం నుంచి మూడు రోజులు జరిగే వేడుకలకు వివిధ ప్రాం తాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు తరలివస్తున్నారు. బాలోత్సవ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 650 పాఠశాలల నుంచి 13000 మంది విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. 20 అంశాలు, 61 విభాగాలలో పోటీలు నిర్వహించేందుకు 32 వేదికలను ఏర్పాటు చేశారు.