దర్శనానికి 6 గంటల సమయం
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:47 PM
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీగిరి బుధవారం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవ వేడుకలు తిలకించడానికి ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

శ్రీశైలం (కోడుమూరు రూరల్), ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీగిరి బుధవారం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవ వేడుకలు తిలకించడానికి ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. దీంతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయానే ఉచిత క్యూలైన నందిమండపం సమీపం వరకు చేరుకుంది. ఒకవైపు మల్లన్నస్వామి, భ్రమరాంబదేవి దర్శనం చేసుకుని వస్తుండగా, మరోవైపు దర్శనం వచ్చే భక్తులు క్యూలైన్లకు చేరారు. దీంతో స్వామిఅమ్మవార్ల దర్శనం సుమారు ఆరుగంటల సమయం తీసుకుంది. క్యూలైన్లలో మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. కొందరు క్యూలైన్లలో కింద కూర్చుండిపోయారు. ఇంకా లడ్డూ కౌంటర్లన్నీ కిటకిటలాడాయి. అడిగినన్ని లడ్డూలను భక్తులకు విక్రయించారు.