Share News

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:41 AM

విద్యుదాఘాతంతో ఓ గిరిజన యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మత్స్యపురం పంచాయతీ ఉప్ప గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం మండపానికి విద్యుత్‌ సరఫరా రాకపోవడంతో ఆ గ్రామానికి చెందిన డి.చంటిబాబు సమీపంలోని విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. విద్యుత్‌ సరఫరా లేదని భావించి తీగలను పట్టుకున్నాడు. అయితే తీగల్లో విద్యుత్‌ ప్రసరిస్తుండడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.

	విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మృతుడు చంటిబాబు(ఫైల్‌ ఫొటో)

విద్యుత్‌ స్తంభం ఎక్కి పని చేస్తుండగా ఘటన

హుకుంపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : విద్యుదాఘాతంతో ఓ గిరిజన యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మత్స్యపురం పంచాయతీ ఉప్ప గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం మండపానికి విద్యుత్‌ సరఫరా రాకపోవడంతో ఆ గ్రామానికి చెందిన డి.చంటిబాబు సమీపంలోని విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. విద్యుత్‌ సరఫరా లేదని భావించి తీగలను పట్టుకున్నాడు. అయితే తీగల్లో విద్యుత్‌ ప్రసరిస్తుండడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారిగా కిందకు పడ్డాడు. అతని శరీరం చాలా వరకు కాలిపోయింది. వెంటనే స్థానికులు అతనిని స్థానిక ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విద్యుత్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 03 , 2025 | 12:41 AM