రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:52 AM
ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలో మండలంలోని ఊటగెడ్డ జంక్షన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పరవాడ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలో మండలంలోని ఊటగెడ్డ జంక్షన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి చెందిన సిబా పెడెంటి (27), మరో ముగ్గురు స్నేహితులు కలిసి కొంతకాలం నుంచి లంకెలపాలెంలోని ఒక హోటల్‌లో వెయిటర్స్‌గా పనిచేస్తున్నారు. సిబా సోమవారం రాత్రి విధులు ముగించుకొని వ్యక్తిగత పనిమీద ద్విచక్ర వాహనంపై ధర్మారాయుడుపేటకు బయలుదేరాడు. ఊటగెడ్డ జంక్షన్ దాటిన తరువాత రోడ్డుపై చనిపోయి ఉన్న గేదెను గమనించక బలంగా ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.