రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:45 AM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 87వ వార్డు కణితి కాలనీకి చెందిన ఉక్కు ఉద్యోగి లక్ష్మీనారాయణ, హేమలతల కుమారుడు వెంకటేశ్ (29) చదువు పూర్తి చేసి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 5న సింగపూర్ నుంచి ఇక్కడకు వచ్చాడు. ఈ నెల 16న మళ్లీ సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
మరొకరికి గాయాలు
కూర్మన్నపాలెం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 87వ వార్డు కణితి కాలనీకి చెందిన ఉక్కు ఉద్యోగి లక్ష్మీనారాయణ, హేమలతల కుమారుడు వెంకటేశ్ (29) చదువు పూర్తి చేసి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 5న సింగపూర్ నుంచి ఇక్కడకు వచ్చాడు. ఈ నెల 16న మళ్లీ సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. కాగా ఆదివారం రాత్రి తన స్నేహితుడు మళ్ల సాయితో కలిసి గాజువాకలోని ఓ మిత్రుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. సోమవారం వేకువవామున రెండున్నరప్పుడు తిరిగి వస్తుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని బైకుతో ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిద్దరిని గుర్తు తెలియని వ్యక్తి అంబులెన్స్‌కు ఫోన్ చేసి కేజీహెచ్‌కు తరలించాడు. అయితే అప్పటికే వెంకటేశ్ మృతి చెందాడు. సాయికి చెయ్యి విరగడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేశ్ తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.