రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:47 AM
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. దీనికి సంబంధించి కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని యు.చీడిపాలెం పంచాయతీ రేవులకోటకు చెందిన పాగి సుందరరావు మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన అనంతరం భార్య గౌరి, ఇద్దరు కుమారులతో శింగవరంలో నివాసముంటున్నారు.
కొయ్యూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. దీనికి సంబంధించి కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని యు.చీడిపాలెం పంచాయతీ రేవులకోటకు చెందిన పాగి సుందరరావు మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన అనంతరం భార్య గౌరి, ఇద్దరు కుమారులతో శింగవరంలో నివాసముంటున్నారు. ఆయన ప్రస్తుతం మంప పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. కాగా ఆయన చిన్న కుమారుడైన అఖిల్(22) పని మీద బైక్‌పై మంగళవారం కృష్ణాదేవిపేటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా పిట్టచలం- కాకరపాడు గ్రామాల మధ్య వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొన్నాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి ఆ యువకుడి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. మంప ఎస్‌ఐ శంకరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి హోంగార్డు కుటుంబాన్ని ఓదార్చారు. ఈ ప్రమాదంపై కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.