రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:09 AM
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడని ఎస్‌ఐ రామారావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
గొలుగొండ, జూలై 29(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడని ఎస్‌ఐ రామారావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని చోద్యం గ్రామానికి చెందిన పైల అప్పల వెంకట సూర్యప్రభాకర్(32) సోమవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సీపట్నం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. పప్పుశెట్టిపాలెం మలుపు వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడడంతో స్థానికులు అతనిని 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఏడేళ్ల క్రితం సూర్యప్రభాకర్ తండ్రి తాతబ్బాయి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా సూర్యప్రభాకర్ మృతితో చోద్యం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.