జీవనంలో యోగా భాగం కావాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:58 AM
యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. యోగాంద్ర- 2025 కార్యక్రమంలో గురువారం అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని ఏపీఐఐసీ వన్‌స్టాప్ సెంటర్ వద్ద భారీ ఎత్తున నిర్వహించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సహకారంతో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు పది వేల మంది పాల్గొన్నారు.
మానసిన ప్రశాంతత, రోగనిరోధక శక్తి
హోం మంత్రి వంగలపూడి అనిత
అచ్యుతాపురం సెజ్‌లో పది వేల మందితో యోగా
హాజరైన ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుందరపు, బండారు, కలెక్టర్ విజయకృష్ణన్
అచ్యుతాపురం, జూన్ 12 (ఆంరఽధజ్యోతి):
యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. యోగాంద్ర- 2025 కార్యక్రమంలో గురువారం అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని ఏపీఐఐసీ వన్‌స్టాప్ సెంటర్ వద్ద భారీ ఎత్తున నిర్వహించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సహకారంతో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు పది వేల మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ, రోజూ యోగా చేయడం వల్ల మానసిన ప్రశాంతత, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతాయని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి రావాలన్నారు. యోగా గురువులు ఆర్.శ్రీను, బి.అప్పారావు వివిధ రకాల ఆసనాలు వేయించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఆయుష్ అధికారి కె.లావణ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.మనోరమ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజు, ఏపీఐఐసీ డీ జీఎం రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌తోపాటు పెద్ద సంఖ్యలో స్థానికులు, సెజ్ కంపెనీల కార్మికులు పాల్గొన్నారు.