Share News

వైద్య కళాశాలలపై వైసీపీ దుష్ప్రచారం

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:28 AM

వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిందని, వైద్య కళాశాలలు తీసుకువచ్చినట్టు జీవోలు ఏమైనా వుంటే చూపించాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సవాల్‌ చేశారు. బుధవారం ఆయన మండలంలోని భీమబోయినపాలెంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వకుండానే వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

వైద్య కళాశాలలపై వైసీపీ దుష్ప్రచారం
భీమబోయినపాలెంలో వృద్ధునికి పింఛన్‌ డబ్బులు అందజేస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.

జీవోలు ఉంటే చూపించండి

గత పాలకులకు స్పీకర్‌ అయ్యన్న సవాల్‌

మాకవరపాలెం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టిందని, వైద్య కళాశాలలు తీసుకువచ్చినట్టు జీవోలు ఏమైనా వుంటే చూపించాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సవాల్‌ చేశారు. బుధవారం ఆయన మండలంలోని భీమబోయినపాలెంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ, ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వకుండానే వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీకి సంబంధించి ఎటువంటి జీవో జారీ చేయకుండా ఈ మండలంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాష్ట్రవాప్తంగా 63,50,765 మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఫింఛన్లు పంపిణీ చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్‌ నందకిశోర్‌, ఆర్‌డీవో వీవీ రమణ, తహశీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీఓ ఛాయసుధ, టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌వై.పాత్రుడు, శెట్టిపాలెం సర్పంచ్‌ అల్లు రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

92.73ు మందికి పింఛన్లు పంపిణీ

అనకాపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్టోబరు నెలకు సంబంధించి ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ఒకటో తేదీన 92.73 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్‌ డబ్బులు అందజేశారు. జిల్లాలో మొత్తం 2,57,322 మంది పింఛన్‌దారులు వుండగా, బుధవారం సాయంత్రానికి 2,38,615 మందికి డబ్బులు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 02 , 2025 | 12:28 AM