వైసీపీ యువత పోరు ర్యాలీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:38 PM
వైసీపీ యువత పోరు కార్యక్రమంలో భాగంగా స్థానిక పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం ర్యాలీగా వెళ్లారు.

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
పాడేరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ యువత పోరు కార్యక్రమంలో భాగంగా స్థానిక పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ పోరులో విద్యార్థులు, నిరుద్యోగులేరీ?
కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు మోసం చేసిందని, వారి సమస్యలపై యువత పోరు పేరిట కలెక్టరేట్ ముందు ఆందోళనలు చేస్తామని, అధిక సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొవాలని వైసీపీ శ్రేణులు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనూ పిలుపునిచ్చింది. కానీ బుధవారం జరిగిన ఆందోళనలో కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలు మినహా ఎక్కడా విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొనలేదు. తమ ఆందోళనలో అధిక సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొంటారని భావించిన వైసీపీ శ్రేణులకు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.