యువత పోరు పేరిట వైసీపీ నాటకాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:19 PM
గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇప్పుడు యువత పోరు పేరిట నాటకాలు ఆడుతోందని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి, విజయనగరం రీజియన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర ధ్వజమెత్తారు.

రూ.వేల కోట్లు బకాయిలు పెట్టి ఇప్పుడు డ్రామాలు
గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం
విజయనగరం రీజియన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర ధ్వజం
అరకులోయ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇప్పుడు యువత పోరు పేరిట నాటకాలు ఆడుతోందని టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి, విజయనగరం రీజియన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో ఈ ఏడాది ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్లు చెల్లించిందన్నారు. ఇంకా వైసీపీ హయాంలో పేరుకుపోయిన బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడతల వారీగా చెల్లిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసిందని, ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి యువత పోరు పేరిట కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, రహదారులకు గోతులు కూడా పూడ్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు. ఈ సమావేశంలో పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు, పద్మాపురం మాజీ సర్పంచ్ లకోయి మహాదేవ్, పెదలబుడు వైస్ సర్పంచ్ చందూ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.